‘మెగాస్టార్ 152’లో మోహన్ బాబు నటించట్లేదు !

‘మెగాస్టార్ 152’లో మోహన్ బాబు నటించట్లేదు !

Published on Feb 13, 2020 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో వాస్తవం లేదట. ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.

ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు