మహేశ్ పుణ్యమా అని మేం మళ్ళీ కలిశాము – మెగాస్టార్ చిరంజీవి

మహేశ్ పుణ్యమా అని మేం మళ్ళీ కలిశాము – మెగాస్టార్ చిరంజీవి

Published on Jan 6, 2020 12:00 AM IST

Chiranjeevi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా… ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘విజయశాంతి చెన్నై టీ నగర్‌‌లో మా ఇంటి ఎదురుగా విజయశాంతి ఇళ్లు ఉండేది. హీరో, హీరోయిన్‌లా కాకుండా కుటుంబసభ్యుల్లా ఉండేవాళ్లం. అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక నన్ను విమర్శించాలని నీకు ఎలా అనిపించింది అని విజయశాంతిని సరదాగా అడగగా.. రాజకీయం వేరు. సినిమా వేరు, అయినా మనిద్దరం మిత్రులం. మా హీరో మీరు. నేను మీ హీరోయిన్ను. ఎక్కువ సినిమాలు మీతో చేశా. మళ్లీ కలిసి నటిద్దాం అని విజయశాంతి అంది. మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. రాజకీయాలు శత్రువులను పెంచుతుంది. మా సినిమా పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. మహేశ్ బాబు పుణ్యమా అంటూ విజయశాంతి, నేనూ కలిశాం అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు