మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న గెటప్ శ్రీను, “రాజు యాదవ్”.!

మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న గెటప్ శ్రీను, “రాజు యాదవ్”.!

Published on May 19, 2024 2:00 PM IST

స్మాల్ స్క్రీన్ టాలెంటెడ్ నటుడు గెటప్ శ్రీను హీరోగా దర్శకుడు కృష్ణమాచారి కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ చిత్రం “రాజు యాదవ్” కోసం తెలిసిందే. మరి గెటప్ శ్రీను డెబ్యూ ఇస్తూ అందులోని తన టాలెంట్ కి తగ్గ సాలిడ్ రోల్ ని చేస్తుండగా ఈ సినిమా ఈ మే 17నే థియేటర్స్ లోకి రావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలు రీత్యా మలి వారానికి వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ లో గెటప్ శ్రీను మరియు చిత్ర యూనిట్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు.

మెగాస్టార్ ఒక స్పెషల్ బైట్ ని చేసి బెస్టాఫ్ లక్ చెప్పారు. గెటప్ శ్రీనుని చూస్తే తనకి అలనాటి నటుడు ఆంధ్ర దిలీప్ కుమార్ గా పిలవబడే చలం గారు గుర్తుకొస్తారు అని తాను హీరోగా పరిచయం అవుతున్న రాజు యాదవ్ ట్రైలర్ చూసినప్పుడు గెటప్ శ్రీను నుంచి ఒక కొత్తదనం ఆశించాను అందుకు తగ్గట్టుగానే ఉందని ఈ మే 24న వచ్చే సినిమా అందరినీ అలరిస్తుందని భావిస్తున్నట్టుగా గెటప్ శ్రీనుకి, దర్శకుడు కృష్ణమాచారికి అలాగే సినిమా యూనిట్ అందరికీ తన బెస్ట్ విషెష్ తెలియజేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు