చిరంజీవి సినిమాలు అంటే అభిమానులు కోరుకునే అంశాల్లో క్రేజీ డ్యాన్సులు కూడ ఒకటి. చిరు ‘ఖైదీ నెం 150’తో రీఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడ మంచి డ్యాన్సులు ఉంటే బాగుండని ఆశించారు అభిమానులు. ఆశతో పాటు ఆరు పదుల వయసులో చిరు డ్యాన్సులు చేయడం సాధ్యమేనా అనే అనుమానం కూడ పుట్టింది. కానీ చిరు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ స్టెప్పులు ఇరగదీశారు. కట్ చేస్తే ‘ఖైదీ నెం 150’ 100 కోట్ల సినిమా అయింది. ఆ సినిమాతో చిరు దగ్గర డ్యాన్సులకు కొదవలేదనే నమ్మకం ఏర్పడిపోయింది.
ఇక ‘సైరా’ సబ్జెక్ట్ వేరు గనుక అందులో చిరు మార్క్ డ్యాన్సులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ‘ఆచార్య’ అలా కాదు. పూర్తిగా కమర్షియల్ సబ్జెక్ట్. డ్యాన్సులకు ఫుల్ స్కోప్ ఉంది. అందుకే మెగాస్టార్ రెచ్చిపోయారు. తన ట్రేడ్ మార్క్ స్టెప్పులను ట్రై చేశారు. ఆయన డ్యాన్సులకు ఒక ఉదాహరణ అన్నట్టు ‘లాహే లాహే’ సాంగ్ ప్రోమోను వదిలారు. అందులో చిరు తన ఫుల్ గ్రేస్ చూపిస్తూ వేసిన ఒకే ఒక్క స్టెప్ ఐఫీస్ట్ అనేలా ఉంది. అది చూశాక సినిమాలో చిరు ఎలా చెలరేగిపోయారో ఒక అంచనా వస్తోంది. మొత్తానికి సాంగ్ ప్రోమో సినిమా మీద ఒక విధమైన హైప్ క్రియేట్ చేసిందనే అనాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


