కొరటాల సినిమాలో ‘మెగాస్టార్’ లుక్ ఇదేనా ?

Published on Dec 16, 2019 12:00 am IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్ ను చిరంజీవినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్‌ ల కోసం రెండు వారల క్రితం బ్యాంకాక్‌ కు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఇదేనంటూ లేటెస్ట్ గా మెగాస్టార్ దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

సంబంధిత సమాచారం :

X
More