మాతృమూర్తితో మెగాస్టార్ విలువైన క్షణాలు !

Published on May 10, 2020 11:06 am IST


నేడు మాతృదినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా జన్మనిచ్చిన అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ మాతృమూర్తి పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ వారితో గడిపిన మధురక్షణాలను తల్చుకుంటున్నారు. కాగా అమ్మ గొప్పదనాన్ని మెగాస్టార్ చిరంజీవి గొప్పగా వర్ణిస్తూ ఆకట్టుకునేలా ట్వీట్ చేశారు.

మెగాస్టార్ పోస్ట్ చేస్తూ. ‘మన కథలన్నింటి వెనుక, మన తల్లి కథ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనమందరం అక్కడ నుండే మొదలవుతాం, అమ్మతో విలువైన క్షణాలు’ అని మెగాస్టార్ తన మాతృమూర్తితో గడిపిన మధురక్షణాలకు సంబంధించిన విజువల్స్ ను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. వీడియోలో పవర్ స్టార్, నాగబాబులతో దిగిన ఫోటోలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

జన్మనిచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పినా.. ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇప్పటికే మాతృదినోత్సవం సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మ గొప్పదనం చాటుతూ ట్వీట్లు చేశారు.

సంబంధిత సమాచారం :