ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ రిలీజ్ చేసిన “భజే వాయు వేగం” టీజర్

ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ రిలీజ్ చేసిన “భజే వాయు వేగం” టీజర్

Published on Apr 20, 2024 2:47 PM IST

హీరో గాను అలాగే విలన్ గాను కూడా మెప్పించిన అతి కొద్ది యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో కార్తికేయ కూడా ఒకడు. మరి తాను హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చండ్రపు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “భజే వాయు వేగం”. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని అయితే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా రిలీజ్ చేయించారు.

అయితే ఈ టీజర్ మాత్రం మంచి రేసీగా ఒక పక్క సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి ఎమోషన్స్ తో కూడా నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. తన తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే యుకుడిగా కార్తికేయ కనిపిస్తున్నాడు. సాలిడ్ లుక్స్ తో యాక్షన్ పార్ట్ లో తాను అదరగొట్టాడు అలాగే తనికెళ్ళ భరణి పై ఎమోషనల్ ఎపిసోడ్ కూడా వర్క్ అయ్యేలా అనిపిస్తుంది.

ఇక ఈ టీజర్ లో రాహుల్ టైసన్ కూడా కనిపిస్తున్నాడు. రధన్ స్కోర్ మాత్రం యాక్షన్ సీన్స్ వరకు టీజర్ లో చాలా యావరేజ్ గా ఉంది. ఆల్రెడీ విన్నట్టుగానే సలార్ స్కోర్ లైన్ కూడా గుర్తు రావచ్చు. ఇది ఫుల్ మూవీలో కరెక్ట్ చేసుకుంటే బెటర్. అలాగే ఆర్ డి రాజశేఖర్ విజువల్స్ బాగున్నాయి. అలాగే యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణ విలువలు కూడా ఈ టీజర్ లో బాగా కనిపిస్తున్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు