మే డే కి ప్రత్యేకమైన వింటేజ్ వీడియో షేర్ చేసిన చిరు

మే డే కి ప్రత్యేకమైన వింటేజ్ వీడియో షేర్ చేసిన చిరు

Published on May 1, 2024 10:08 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠతో భారీ చిత్రం “విశ్వంభర” కోసం తెలిసిందే. మరి ఈ షూట్ లో బిజీగా ఉంటూనే చిరు మరిన్ని ఇతర కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే చిరు ఈ స్థాయికి తన కష్టం మీద వచ్చారు. సినిమా పరంగా ఇప్పటికీ ఓ కార్మికునిలా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలా ఈ మే 1 మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా చిరు ఓ వింటేజ్ వీడియో పోస్ట్ చేసి అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

తన 20 ఏళ్ల కితం “22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలనిపని పిల్లలుగా చేయొద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం చేసిన “చిన్ని చేతులు” క్యాంపైన్ అంటూ పోస్ట్ చేసి ఈరోజు అందరికీ రిలవెంట్ అవుతుంది అనిపించి షేర్ చేస్తున్నాను అని చిన్నారి కార్మికులకు నో చెప్పండి అందరికీ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు అని తెలిపారు. దీనితో ఈ స్పెషల్ విషెస్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు