మరోసారి ఈ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న చిరు!?

మరోసారి ఈ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న చిరు!?

Published on May 21, 2024 10:00 AM IST

మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తదుపరి బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రం లో కనిపించనున్నారు చిరు. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి నెలలో గ్రాండ్ గా థియేటర్ల లోకి రానుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మరోసారి డైరెక్టర్ మోహన్ రాజాతో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మోహన్ రాజా చెప్పిన స్టోరీ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను చిరు కుమార్తె అయిన సుస్మిత కొణిదెల నిర్మించనుంది. అయితే మోహన్ రాజా గతంలో మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ అనే పొలిటికల్ మూవీ ను చేశారు. ఇది మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ అయిన లూసిఫర్ చిత్రానికి అధికారిక రీమేక్. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. చిరు తదుపరి చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు