టిల్లు స్క్వేర్ టీమ్ ను అభినందించిన చిరంజీవి

టిల్లు స్క్వేర్ టీమ్ ను అభినందించిన చిరంజీవి

Published on Apr 1, 2024 10:03 PM IST

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ గతవారం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాను వీక్షించి, చిత్రబృందాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. సిద్ధు జొన్నలగడ్డ, మల్లిక్ రామ్, కళ్యాణ్ శంకర్, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఎడిటర్ నవీన్ నూలి ఆయన ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించారు.

టీమ్‌ని అభినందిస్తూ, మా ఫ్యామిలీ అంతా డీజే టిల్లును ఇష్టపడ్డారు. సిద్దు జొన్నలగడ్డ అంటే మా కుటుంబంలో కూడా అందరికి అభిమానం. అందుకే ఆత్రుతగా ఈ చిత్రాన్ని చూశాను. వెంటనే టీమ్‌ని ఆహ్వానించి ఎక్స్ ప్రెస్ చేయాలని అనుకున్నాను. DJ టిల్లు చూసిన తర్వాత కూడా, నేను సిద్దును మా ఇంటికి పిలిచి మెచ్చుకున్నాను అని అన్నారు. దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, కళ్యాణ్ శంకర్ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు కొనియాడారు.

నవీన్ నూలి ఎడిటింగ్ ప్రయత్నాలను కూడా చిరు మెచ్చుకున్నారు. అడల్ట్ కామెడీ అని లేబుల్ చేసేవారిని పట్టించుకోవద్దని ప్రజలను కోరారు. దానికి బదులు ఈ సినిమా అన్ని ప్రేక్షకులకు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అభివర్ణించారు. మెగాస్టార్ ఉదారంగా ప్రశంసించినందుకు మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు