మెగాస్టార్ ముఖ్య అతిధిగా ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుక !
Published on Mar 12, 2018 8:54 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిటించిన తాజా చిత్రం ‘రంగస్థలం’ చివరి దశ పనుల్లో ఉంది. దీంతో చిత్ర యూనిట్ మార్చి 18న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ పట్టణంలోని ఆర్కే బీచ్ లో ఈ వేడుక జరగనుంది. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానుండగా పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్న నిర్వాహకులు ఘనమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడ ఉండనున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకులకు అందివ్వనున్నారు నిర్మాతలు.

 
Like us on Facebook