ప్లాస్మా దానంపై మెగాస్టార్ భావోద్వేగ సందేశం.!

మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో సామాజిక సేవ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఒక మెట్టు ముందే ఉంటారు గత ఏడాది కోవిడ్ ప్రభావం నుంచి ఇప్పటి వరకు కూడా తన ట్రస్ట్ తో అనేక మంది సినీ కార్మికులను ఆదుకున్నారు ఇప్పటికీ కొనసాగితున్నారు. మరి ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులు మరియు ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ ఓ సందేశాన్ని తన సోషల్ మీడియా ద్వారా వీడియో రూపేణా తెలియజేసారు.

“ఎవరైనా కరోనా బారిన పడి కోలుకున్న వారు ఉంటే సరిగ్గా నెల రోజుల్లో యాంటీ బాడీస్ తయారవుతాయని అలాంటి వారు కనుక ప్లవమను దానం చేస్తే వారు కరోనా బారిన పడిన ఇద్దరిని కాపాడిన వారు అవుతారని అందుకుగాను ప్లాస్మా దానం చేసేందుకు ప్రతీ ఒకరు రావాలని అర్జించారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉంటూ తమ ఊర్లని తద్వారా రాష్ట్రాన్ని అలా దేశాన్ని కాపాడుకోవాలని” ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివతో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version