పవన్ ఫ్యాన్స్ కి బూస్టప్ ఇస్తున్న చిరు తాజా కామెంట్స్.!

పవన్ ఫ్యాన్స్ కి బూస్టప్ ఇస్తున్న చిరు తాజా కామెంట్స్.!

Published on Nov 20, 2022 3:46 PM IST

టాలీవుడ్ అగ్ర హీరోలు అలాగే సోదరులు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కోసం తెలుగు ప్రజలకి పరిచయం చేయాల్సిన పని లేదు. హీరోలుగా భారీ క్రేజ్ మరియు వసూళ్లతో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతారు. ఇక ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ కూడా పాలిటిక్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే చిరు రాజకీయాల నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ సినిమాలు చేసుకుంటుండగా పవన్ మాత్రం ఇప్పుడు రెండు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బయట ఉన్న చిరు అయితే పవన్ పై పాలిటిక్స్ పరంగా చేసే ఏ కామెంట్స్ అయినా కూడా రీసెంట్ టైం లో చాలా ఆసక్తిగా మారుతున్నాయి.

ఇక తాజాగా కూడా మరోసారి మెగాస్టార్ అతిధిగా పాల్గొన్న ఓ ఈవెంట్ లో పవన్ పై చేసిన కామెంట్స్ తన అభిమానులకి అలాగే రాజకీయకంగా ఫాలో అయ్యేవారికి మంచి బూస్టప్ లా నిలిచాయి. అయితే చిరు పాలిటిక్స్ లో ఉండాలి అంటే అన్నిటికి సిద్ధమై ఉండాలి మాటలు పడాలి, అనాలి సున్నిత మనస్తత్వంతో ఉండలేమని తెలిపారు.

కానీ తను తగినవాడు మాటలు పడతాడు, తిరిగి అంటాడు. అలా మీ అందరి మన్ననలు పొందాడు. ఏదో ఒక రోజు తప్పకుండ అత్యున్నత స్థానంలో ఉంటాడు అని పవన్ ను ఉద్దేశించి చిరు కామెంట్స్ చేయడం జరిగింది. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహాన్ని అయితే తీసుకొచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు