బుకింగ్స్ లో అప్పుడే సెన్సేషనల్ మైల్ స్టోన్ కొట్టేసిన మెగాస్టార్ సినిమా!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా వెంకీ మామ గెస్ట్ రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమానే ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించి థియేటర్స్ లో బ్లాస్ట్ గా నిలిచింది. ఇలా బుకింగ్స్ పరంగా సినిమా బుక్ మై షోలో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ చిత్రానికి అందులో 1 మిలియన్ టికెట్ సేల్స్ ని ఈ సినిమా అందుకుంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది కేవలం ఈ రెండు రోజుల్లోనే కాగా ఫైనల్ రన్ లో ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా హర్షవర్ధన్, క్యాథరిన్ తదితరులు నటించగా సుష్మిత కొణిదెల అలాగే సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version