‘నీలాంబరి’ సాంగ్ పై మెగాస్టార్ మెగా రెస్పాన్స్.!

Published on Nov 5, 2021 2:25 pm IST


ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న క్రేజీ మల్టీ స్టారర్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తీసిన చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

కానీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చాక చిత్ర యూనిట్ సినిమా అవైటెడ్ రెండో సాంగ్ ని ఈరోజు రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేసారు. మామూలుగానే మణిశర్మ సంగీతం కోసం చెప్పక్కర్లేదు ఆ కోణంలోనే ఆచార్య నుంచి “మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో మారు రుజువు చేస్తున్న నీలాంబరి” అని తెలియజేసారు.

చిరు, మణిశర్మ ల మధ్య ఎన్నో మెలోడీలు మాస్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లు ఉన్నాయి. అలాంటిది చరణ్ సాంగ్ కి అందులోని తన సినిమా నుంచే ఓ సాంగ్ ఇచ్చిన మణిశర్మపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి మొత్తం సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :