చిరు షూట్ కోసం డేట్స్ లాక్ చేసిన ‘బ్రూస్ లీ’ టీం

చిరు షూట్ కోసం డేట్స్ లాక్ చేసిన ‘బ్రూస్ లీ’ టీం

Published on Sep 25, 2015 11:39 AM IST

chiranjeevi

మెగా అభిమానులు సంక్రాంతి, దీపావళి, వినాయకచవితి.. ఇలా అన్ని పండుగలను కలిపి చేసుకునే దానికి ఇంకో 21 రోజులు మాత్రమే ఉన్నాయి.. ఏంటి అంత పెద్ద పండుగ అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీని మరియు ఒకేసారి చిరంజీవి – రామ్ చరణ్ లను తెరపై చూసే రోజు కాబట్టి. అదేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ రిలీజ్ అయ్యే రోజు. షూటింగ్ చివరి దశలో ఉన్న బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఆయనపై వచ్చే సీన్స్ ని షూట్ చేయడం కోసం షూటింగ్ డేట్స్ ని ఫిక్స్ చేసారు ఈ చిత్ర టీం.

ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నెల చివర్లో అనగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో చిరంజీవి పార్ట్ కి సంబందించిన ఒక ఫైట్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చి చిరుపై వచ్చే ఓ పాటని కూడా షూట్ చేయనున్నారు. ప్రస్తుతం చిరు షూటింగ్ కోసం రెడీ అవుతుంటే, టెక్నికల్ టీం ఆయన పార్ట్ షూట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ ని అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా శరవేగంగా జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు