కేరళ నేపథ్యంలో మెగాస్టార్ ‘వేదాళం’ ?

Published on Apr 4, 2021 10:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఓ కీలక సీక్వెన్స్ కేరళ బ్యాక్‌డ్రాప్ లో నడుస్తోందట. ఈ నేపథ్యానికి కథకు మధ్య ప్రత్యేక లింక్ ఉంటుందట. ఇక ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ లేని సీన్స్ ను మెహర్ రమేష్ ఇప్పటికే షూట్ చేశారు.

ఇక 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన చిరంజీవి ఈ మూవీ రీమేక్ లో నటించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరు సోదరి రోల్ కు సాయి పల్లవిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వనున్నట్టు టాక్.

సంబంధిత సమాచారం :