మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్నదని వార్తలు వచ్చాయి, కానీ వినాయక్ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, మళ్ళీ ఈ సినిమా సుజీత్ దగ్గరికే వెళ్లిందని.. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట.
కాగా సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారు. అలాగే సాయి మాధవ్ తో పాటు ఆకుల శివ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని సుజీత్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.
