క్షమాపణలు చెప్పమంటున్న హీరోయిన్

క్షమాపణలు చెప్పమంటున్న హీరోయిన్

Published on May 15, 2024 10:40 PM IST

హీరోయిన్ మెహరీన్‌ పిర్జాదా ఇటీవల ‘ఎగ్ ఫ్రీజింగ్‌’ గురించి వివరిస్తూ ఓ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఐతే, తన కామెంట్స్ పై కొందరు తప్పుడు వార్తలు రాశారు అని తాజాగా మెహరీన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మెహరీన్‌ ఇంకా మాట్లాడుతూ… ‘తప్పుడు వార్తలను ప్రజలకు అందించడం అనైతికం. పైగా చట్ట విరుద్ధం కూడా. ఇటీవల నేను పెట్టిన ‘ఫ్రీజింగ్‌ ఎగ్స్‌’ పోస్ట్‌పై కొందరు రకరకాల తప్పుడు వార్తలు రాసి, నన్ను ఇబ్బంది పెట్టారు.

మెహరీన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నేను ధైర్యం చేసి ఆ విషయం గురించి చెప్పాను. ఫ్రీజింగ్‌ ఎగ్స్‌ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం ఏముంది ?, బాధ్యతయుతమైన సెలబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసం నేను ఆ విధంగా కామెంట్స్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి ఎంతో మేలు చేస్తోంది. ఇవన్నీ ఆలోచించకుండా నా పై తప్పుడు కథనాలు రాశారు. నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించి, నాకు బహిరంగ క్షమాపణలు చెప్పండి’ అంటూ మెహరీన్‌ చెప్పుకొచ్చింది. మెహరీన్ కి, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ తో నిశ్చితార్థం జరిగాక, వారిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు