సమీక్ష : మేమ్‌ ఫేమస్ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

సమీక్ష : మేమ్‌ ఫేమస్ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

Published on May 27, 2023 3:04 AM IST
Mem Famous Movie Review In Telugu

విడుదల తేదీ : మే 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి తదితరులు

దర్శకులు : సుమంత్ ప్రభాస్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్

సంగీత దర్శకులు: కళ్యాణ్ నాయక్

సినిమాటోగ్రఫీ: శ్యామ్

ఎడిటర్: సృజన

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్’. సుమంత్‌ ప్రభాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

మహేష్ (సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ (మణి), బాలకృష్ణ (మౌర్య) ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఊర్లో బేవర్స్ గా తిరుగుతూ అందరి చేత తిట్లు తింటూ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మహేష్ – దుర్గ – బాలకృష్ణ జీవితాలు ఎలా మారాయి ?, జీవితంలో స్థిర పడటానికి ఈ ముగ్గురు ఏం చేశారు ?, ఈ క్రమంలో వీరంతా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ?, చివరకు వీరంతా ఎలా ఫేమస్ అయ్యారు ?, ఈ మధ్యలో మౌనిక (సార్య లక్షణ్)తో మహేష్ ప్రేమకథ, బుబ్బి (సిరిరాశి)తో బాలకృష్ణ ప్రేమకథ ఎలా సాగాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మంచి నేటివిటీతో పాటు సహజమైన కథాంశం ఆధారంగా దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ ఈ స్క్రిప్ట్ ను రాసుకోవడం సినిమాకి ప్లస్ అయింది. అలాగే, ఈ సినిమాకు చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ అండ్ కామెడీ స‌న్నివేశాలను కూడా సుమంత్‌ ప్రభాస్‌ బాగానే రాసుకున్నాడు. ఓ గ్రామం చుట్టూ దర్శకుడు అల్లిన డ్రామా బాగుంది. హీరోగా కూడా సుమంత్‌ ప్రభాస్‌ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు.

హీరో స్నేహితులుగా నటించిన మణి, మౌర్యలు కూడా చాలా బాగా నటించారు. ఇక హీరోయిన్ కి తండ్రి పాత్ర‌లో మురళీధర్‌ గౌడ్‌ ప‌ర‌కాయం ప్ర‌వేశం చేస్తూ.. తన పాత్రకు తగ్గట్లుగానే మంచి కామెడీ టచ్ ఇచ్చాడు. అలాగే మిగిలిన ప్ర‌ధాన‌మైన పాత్రల్లో కిరణ్‌ మచ్చ, అంజిమామలు కూడా త‌మ పాత్ర‌లకు పూర్తి న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్లు సిరిరాశి, సార్య కూడా బాగానే నటించారు. సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

సుమంత్‌ ప్రభాస్‌ మంచి స్టోరీ సెటప్ ను తీసుకున్నారు కానీ, ఆ సెటప్ కు తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మాత్రం మలచలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథనం విషయంలో సుమంత్‌ ప్రభాస్‌ మెప్పించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు చాలా స్లోగా సాగుతాయి.

దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు. కథగా కూడా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కథగా చెప్పాలంటే పెళ్లి చూపులు, జాతి రత్నాలు కలిస్తే మేమ్ ఫేమస్ అన్నట్టు ఉంటుంది. సుమంత్‌ ప్రభాస్‌ కథ పై ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరో స్థాయిలో ఉండేది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు. దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే, ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘మేమ్‌ ఫేమస్’ అంటూ వచ్చిన ఈ చిత్రం కామెడీగా సాగుతూ అక్కడక్కడ మంచి నేటివిటీ ఫీల్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే, కథ సింపుల్ గా ఉండటం, సెకండ్ హాఫ్ ప్లే కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే కీలకమైన సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే, సుమంత్‌ ప్రభాస్‌ తో పాటు మిగిలిన నటీనటుల నటన ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే అలరిస్తాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు