మెమొరబుల్ పిక్ : తన వారసుడితో యంగ్ హీరో నిఖిల్

మెమొరబుల్ పిక్ : తన వారసుడితో యంగ్ హీరో నిఖిల్

Published on Feb 21, 2024 2:23 PM IST

టాలీవుడ్ సినిమాలో తన సినిమాలకంటూ మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్న యంగ్ హీరోస్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకడు. మరి నిఖిల్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఒక గుడ్ న్యూస్ ని తాను షేర్ చేసుకున్నాడు. గత 2020 లో నిఖిల్ కి పల్లవితో పెళ్ళైన సంగతి తెలిసిందే. మరి ఈ యువ జంట ఇప్పుడు ఓ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యారు.

మరి తన వారసుడిని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతున్న నిఖిల్ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ అయితే ఇప్పుడు పిక్ రూపంలో బయటకి వచ్చి వైరల్ గా మారింది. మరి టాలీవుడ్ లో ఎన్నో థ్రిల్లర్స్ ఇచ్చి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ అందుకున్న నిఖిల్ ఈ హ్యాపీ మూమెంట్ చూసి వారు సహా సినీ ప్రముఖులు తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి నిఖిల్ కి మా 123తెలుగు యూనిట్ తరపు నుంచి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు