నేడు, ఆదివారం జరిగిన ‘మేము సైతం’ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మంచు ఫ్యామిలీ పార్టిసిపేట్ చేసిన కబడ్డీ మ్యాచ్ ఆడియన్స్ కి ఫుల్ మస్త్ మజా ఎంటర్టైన్మెంట్ అందించింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మంచు విష్ణు, మంచు మనోజ్ టీంలు తలపడ్డాయి. మనోజ్ టీంలో బ్రహ్మానందం చేసిన హంగామా వీక్షకులకు వినోదం అందించింది. రిఫరీగా మంచు మోహన్ బాబు, వ్యాఖ్యాతగా విక్టరీ వెంకటేష్ ల సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మంచు బ్రదర్స్ మధ్య జరిగిన ఈ కబడ్డీ సమరంలో తమ్ముడు మంచు మనోజ్ టీం విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత సూపర్ 6 క్రికెట్ మొదలు కానుంది.
ఈ రోజు ఉదయం నుండి ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమంలో ప్రముఖులు నిర్విరామంగా ప్రదర్సనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు.


