“మెర్సి కిల్లింగ్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన హీరో ఆకాష్ పూరి!

“మెర్సి కిల్లింగ్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన హీరో ఆకాష్ పూరి!

Published on Mar 19, 2024 7:09 AM IST

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా “మెర్సి కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ, మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది, మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని అన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్. స్వేచ్ఛ అనే అనాధ బాలిక, తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్ సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్, డైరెక్టర్ వెంకటరమణ ఎస్, నిర్మాతలు సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల, సమర్పణ శ్రీమతి వేదుల బాల కామేశ్వరి, సినిమాటోగ్రఫీ అమర్.జి, సంగీతం ఎం.ఎల్.రాజ, ఎడిటర్ కపిల్ బల్ల, ఆర్ట్ నాయుడు, మాటలు వై. సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పృథ్వి కడియం, లైన్ ప్రొడ్యూసర్ బాబీ శివకోటి లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు