IPL 2025 : చెన్నైపై ముంబై గ్రాండ్ విక్టరీ

csk vs Mi

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో MI తన ప్రత్యర్థి CSKపై రివెంజ్ తీర్చుకుంది. టాస్ గెలిచిన MI తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌కు వచ్చిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. షేక్ రషీద్ (19), ఆయుష్ మాత్రే (32), రవీంద్ర జడేజా(53 నాటౌట్), శివమ్ దూబే(50) రాణించడంతో CSK 176 పరుగులు చేసింది.

దీంతో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన MI దూకుడుగా ఆడింది. ఓపెనర్ రియాన్ రికెల్టన్(24) త్వరగా ఔట్ అయినా.. రోహిత్ శర్మ(76 నాటౌట్), సూర్య కుమార్ యాదవ్(68 నాటౌట్) దూకుడుగా ఆడి ముంబైకి విజయాన్ని అందించారు. కేవలం 15.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయిన ముంబై 9 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించి ఐపీఎల్ 2025లో ప్రతీకారం తీర్చుకుంది.

Exit mobile version