సంక్రాంతికి ‘మిరాకిల్’ ట్రీట్.. యాక్షన్ మోడ్‌లో హెబ్బా పటేల్, రణధీర్

Miracle

ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రణధీర్ భీసు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను గురువారం (జనవరి 16) మేకర్స్ విడుదల చేశారు. సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా, అక్షర నున్న సుజన మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే పోరాట సన్నివేశాలతో కూడిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండో షెడ్యూల్ షూటింగ్ జనవరి 22 నుంచి హైదరాబాద్ పరిసరాల్లో జరగనుంది.

‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాల తర్వాత ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. హెబ్బా పటేల్ గ్లామర్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీత బాధ్యతలను కూడా దర్శకుడే నిర్వహిస్తుండటం విశేషం.

Exit mobile version