తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’ థియేట్రికల్ విడుదలకు ముందే జపాన్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 21న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అత్యధిక బుకింగ్స్ సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఇప్పటికే చోటు దక్కించుకోవడం విశేషం. సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి 2’ సరసన నిలిచేందుకు ఈ చిత్రం వేగంగా దూసుకుపోతోంది. జపాన్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా టాప్ 10లో నిలిచిన అతికొద్ది తెలుగు చిత్రాల్లో ఒకటిగా ‘మిరాయ్’ ఘనత సాధించింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతుండగా, జపాన్ బాక్సాఫీస్ వద్ద ఈ అడ్వాన్స్ ట్రెండ్ భారీ వసూళ్లుగా మారే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
