“థగ్ లైఫ్” సెట్స్‌లో చేరిన మీర్జాపూర్ నటులు?

“థగ్ లైఫ్” సెట్స్‌లో చేరిన మీర్జాపూర్ నటులు?

Published on Apr 30, 2024 7:36 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రం లో స్టార్ హీరోయిన్ అయినటువంటి త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం న్యూ ఢిల్లీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ బాలీవుడ్ నటులు అలీ ఫజల్ మరియు పంకజ్ త్రిపాఠి లు సెట్స్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ప్రముఖ వెబ్ సిరీస్ మీర్జాపూర్‌లో చేసిన పనికి గుర్తింపు పొందారు. వీరు ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లైతే సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.

శింబు కూడా తాజా దశ నిర్మాణ దశలో చేరాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంత్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, గౌతం కార్తీక్, దుల్కర్ సల్మాన్ మరియు నాజర్ ఇందులో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ ఈ భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు