‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా – అనుష్క శెట్టి

Published on Sep 6, 2023 2:01 am IST

యువ నటుడు నవీన్ పోలిశెట్టి, స్టార్ నటి అనుష్క శెట్టి ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు పి. మహేష్ తెరకెక్కించగా రాధన్ సంగీతం అందించారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ సెప్టెంబర్ 7న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో అనుష్క శెట్టి మాట్లాడుతూ, తొలిసారిగా మహేష్ ద్వారా 2019లో ఈమూవీ కథ విన్నాను. ఇది నా మనసుకు చాలా దగ్గరైంది. అక్కడి నుండి దాదాపుగా రెండేళ్లకు పైగా ఈ కథతో ప్రయాణం చేశాను అన్నారు. అయితే షూటింగ్ ఫస్ట్ డే, లాస్ట్ డే తాను కొంత నెర్వస్ గా ఉన్నానని, ఇక సినిమా మరొక రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానుండడంతో తనకు ఇప్పుడు కూడా కొంత నెర్వస్ గా ఉందని, అలానే తప్పకుండా మా అందరి నమ్మకం నిజమై ఆడియన్స్ సినిమాని ఆదరిస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :