వైరల్: ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ లో మిస్టేక్.. ఇంత అజాగ్రత్తగానా!

వైరల్: ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ లో మిస్టేక్.. ఇంత అజాగ్రత్తగానా!

Published on Sep 11, 2026 4:27 PM IST

స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించింది. ఇక థియేటర్స్ లో రన్ తర్వాత లేటెస్ట్ గానే ఓటిటిలో విడుదలకి వచ్చింది.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా వీక్షకులకు ఒక చోట మాత్రం డిజప్పాయింటింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది. దాదాపు సినిమా సగానికి చేరుకున్న సమయంలో మమిత తన బాబుని సూర్య ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తుంది. తన వెనకే సూర్య కూడా ఇంటికి వస్తాడు, ఇద్దరికీ నడిచే వాగ్వాదం సీక్వెన్స్ అంతా విజువల్స్ క్లారిటీ మిస్ అయ్యింది.

ఏదో ఎడిటింగ్ టేబుల్ మీద లేయర్లు వేసి పని పూర్తి చేయకుండా ప్రింట్ ని పెట్టేసినట్టుగా వదిలేసారు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. ఇంత పెద్ద సినిమా, స్టార్ నటుడు, అది కూడా నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ప్లాట్ ఫామ్ లో ఇంత మిస్టేక్ చేయడం విమర్శలు తెస్తుంది. మరి దీనిని నెట్ ఫ్లిక్స్ సరి చేసుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు