ట్రైలర్ టాక్ : హారర్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ చేసే ‘418’

ట్రైలర్ టాక్ : హారర్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ చేసే ‘418’

Published on Sep 11, 2026 6:04 PM IST

ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో కిర్తన్ నాగగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘418’. ఈ సినిమా గ్లింప్స్, ప్రమోషనల్ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పాత భవనం, అందులోని 418వ గది చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను భయానక లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది.

అసాధారణ శక్తుల ప్రభావంతో ఓ చిన్న బాలుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, దాని వెనుక ఉన్న భయంకరమైన నేపథ్యం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడం ఖాయం. ఈ చిత్రంలో చైత్రా ఆచార్ అభయనం ప్రధాన ఆకర్షణగా నిలవగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సహజమైన భయాలతో దర్శకుడు కిర్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. గుండెధైర్యం ఉన్నవారే థియేటర్లలో చూడాల్సిన ఈ విజువల్ వండర్, సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు