‘ఎం.ఎల్.ఏ’ దర్శకుడికి మరో అవకాశం !

గత వారం విడుదలైన కళ్యాణ్ రామ్ చిత్రం ‘ఎం.ఎల్.ఏ’ మొదటి వారంలోనే మంచి వసూళ్లను రాబట్టి నిర్మాతలకి లాభదాయకమైన సినిమాగా మారుతోంది. ఏ విజయం పట్ల నిర్మాతలు కూడ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి చిత్రమే అయినా కమర్షియల్ అంశాల్ని బాగా హ్యాండిల్ చేశారని దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ను ప్రశంసిస్తున్నారు చాలా మంది.

అందుకే చిత్ర నిర్మాతలు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు ఇటీవల జరిగిఆన్ ఒక ఇంటర్వ్యూలో తమకు ఉపేంద్ర మాధవ్ వర్క్ నచ్చిందని, ఆయనతో ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నామని అన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలువురుని, ఇతర వివరాలేమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version