కళ్యాణ్ రామ్ సినిమా నుండి రెండవ పాట
Published on Mar 12, 2018 1:47 pm IST


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు ‘మంచి లక్షణాలున్న అబ్బాయి, నా నువ్వే’లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో ముందుగా ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం పూర్తికానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా సినిమాలోని రెండవ పాట ‘హేయ్ ఇందు’ రేపు ఉదయం 10 గంటల 30 నిముషాలకు రిలీజ్ కానుంది.

ఇది వరకే విడుదలైన ‘మోస్ట్ వాంటెడ్ అబ్బాయి’ అనే మొదటి పాటకు మంచి స్పందన లభించింది. మణి శర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు. మార్చి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఇకపోతే జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘నా నువ్వే’ చిత్రం మే 25న విడుదలకానుంది.

 
Like us on Facebook