‘పురుష:’ కోసం కీరవాణి పాడిన ‘జాలి పడేదెవ్వడు’ సాంగ్ రిలీజ్

Jali Padedevvadu

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి గళం నుంచి జాలువారిన ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అనే పాటను ‘పురుష:’ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. భార్యాభర్తల బంధం, సంసారంలో మగాడి వెతలు ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. మగాడి పరిస్థితిపై సానుభూతి కలిగించేలా అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం, శ్రవణ్ భరద్వాజ్ అందించిన క్యాచీ ట్యూన్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది. సప్తగిరి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version