రేపు విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ ఫస్ట్ సింగల్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ కానుంది. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్’ వంటి సినిమాలతో వరుస హిట్లను అందుకున్న దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండంతో ప్రేక్షకుల్లో ఫలితంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే ఈ సినిమా ఆడియో నుండి మొదటి పాటను రేపు 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆడియో వేడుకను ఏప్రిల్ 7న వైజాగ్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.

Exit mobile version