దరువు విడుదల వాయిదా?

దరువు విడుదల వాయిదా?

Published on Apr 23, 2012 8:34 PM IST

రవితేజ, తాప్సీ జంటగా నటిస్తున్న ‘దరువు’ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం మే 4న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 4న నుండి మే 18కి వాయిదా పడినట్లు సమాచారం. దమ్ము, గబ్బర్ సింగ్ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ చిత్ర విడుదల వాయిదా వేయాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ అంటోనీ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు