ఎనేర్జిటిక్ స్టార్ రవి తేజ ఈరోజు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. భూపతి రాజు రవి శంకర్ రాజు గా 1968 జనవరి 26 న జంగంపేట లో జన్మించిన ఈ నటుడు తండ్రి ఉద్యోగ రిత్యా చిన్నతనం అంతా పలు ప్రదేశాల్లో గడిపారు. తరువాత డిగ్రీ విజయవాడ సిద్దార్థ డిగ్రీ కాలేజీ లో పూర్తి చేసారు చిన్నతనం నుండే చిత్ర పరిశ్రమ మీద ఆసక్తి ఉన్న ఈ నటుడు ముందు డిగ్రీ పూర్తవ్వగానే కృష్ణ వంశి దగ్గర “నినే పెళ్ళాడుతా” చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. “సింధూరం” చిత్రం లో చిన్న పాత్ర వేసిన రవి తేజ “నీకోసం” చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు కాని పూరి జగన్నాథ్ చేసిన “ఇడియట్” చిత్రం తో తారగా ఎదిగారు. ఆ తరువాత రవి తేజ తన కెరీర్ లో వెనక్కి చూసుకోలేదు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” , ” నా ఆటోగ్రాఫ్ “, “ఖడ్గం “,”మిరపకాయ్” మొదలగు చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన ఎనేర్జి మరియు డైలాగు డెలివరీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలతో బిజీ గా ఉన్న రవితేజ త్వరలో “నిప్పు” చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నటుడికి 123తెలుగు.కాం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రవితేజ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
రవితేజ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
Published on Jan 26, 2012 4:26 PM IST
సంబంధిత సమాచారం
- ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
- రీసెంట్ హారర్ సెన్సేషన్స్ ‘అబ్సెషన్’, ‘బ్యాక్ రూమ్స్’ సంస్థ నుంచి మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ కి రిలీజ్ డేట్ లాక్!
- “200 రోజులు కష్టపడ్డా వర్కవుట్ కాలేదు, 45 రోజుల సినిమా బ్లాక్బస్టర్” – ‘కంగువ’పై సూర్య ఓపెన్ టాక్
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !


