డబ్బింగ్ పనుల్లో బిజినెస్ మ్యాన్

డబ్బింగ్ పనుల్లో బిజినెస్ మ్యాన్

Published on Dec 6, 2011 1:57 AM IST

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రకి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి డబ్బింగ్ చెబుతున్నారు. ఆమె ఈ రోజు శబ్దాలయ స్టుడియోలో డబ్బింగ్ చెప్పారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక థీమ్ సాంగ్ పాడారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకం బ్యానర్ పై నిర్మించారు. ఈ నెల శిల్ప కళా వేదికలో ఆడియోని విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు