కెవ్వు కేక పాట చిత్రీకరణ పూర్తి

కెవ్వు కేక పాట చిత్రీకరణ పూర్తి

Published on Apr 19, 2012 7:08 PM IST

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని కెవ్వు కేక పాట చిత్రీకరణ పూర్తయినట్లు మాకు సమాచారం లభించింది. మలైకా అరోరాతో పాటుగా 100 మందికి పైగా డాన్సర్స్ పాల్గొంటున్న ఈ పాటలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టుడియోలోని సేవన్ ఏకర్స్ ప్రాంతంలోని 4వ ఫ్లోర్లో ఈ పాట చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అశోక్ మాస్టర్ ఈ పాటకి కోరియోగ్రఫీ అందించారు. రేపటి నుండి ఈ సినిమాలోని దేఖో దేఖో గబ్బర్ సింగ్ అనే పాట చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటలపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు