రేసింగ్ సీరీస్ లో పాల్గొనబోతున్న నాగార్జున

రేసింగ్ సీరీస్ లో పాల్గొనబోతున్న నాగార్జున

Published on Nov 22, 2011 10:35 PM IST

అక్కినేని నాగార్జున త్వరలో ఒక రేసింగ్ సీరీస్ లో పాల్గొనబోతున్నారు. అయితే కేవలం ఒక ఓనర్ గానేనండోయ్. ఐ 1 సూపర్ సీరీస్ లో పాల్గొనే హైదరాబాద్ టీం ని నాగార్జున కైవసం చేసుకున్నారు. ప్రతి జట్టు లో ఒక ఇండియన్ డ్రైవర్ మరియు ఒక విదేశీ డ్రైవర్ ఉంటారు. జనవరి 2012 నుండి ఈ సీరీస్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే షారుఖ్ ఖాన్ ముంబై జట్టు ని కైవసం చేసుకున్నాడు. బెంగళూరు జట్టును అర్జున్ మరియు ఢిల్లీ జట్టును అరిందం చౌదరి కొనుక్కున్నారు. తొమ్మిది జట్లతో కూడుకున్న ఈ సీరీస్ లో మొత్తం పన్నెండు రేస్ లు ఉంటాయి. ఇండియా, మలేషియా, బహ్రెయిన్,  ఖతార్ లలో ఈ రేసులు జరుగుతాయి.

మచ్దర్ మోటార్ స్పోర్ట్స్ అధినేత్రి అంజనా రెడ్డి ఈ విషయాన్నీ స్వయంగా ధ్రువీకరించారు. “నాగార్జున లాంటి వ్యక్తి మా సీరీస్ లో పాల్గొనటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అయన రాకతో మా సీరీస్ కు మంచి బలం చేకూరిందని మేం భావిస్తున్నాం” అన్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ సీరీస్ లో పాల్గొంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు