సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న రాజన్న

సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న రాజన్న

Published on Dec 19, 2011 4:59 PM IST

 

కింగ్ నాగార్జున నటించిన రాజన్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి సర్టిఫికేట్ నిర్మాతలకి చేరుతుంది. ఇండస్త్రీ వర్గాల సమాచారం ప్రకారం చిన్న కట్ ల తో సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా నిడివి 2 గంటల 14 నిముషాలు ఉంటుంది .

ఈ చిత్రం ఈ నెల 22న భారి విడుదల కి, ఈ నెల 21 తేదీన USA లో ప్రేమీయర్ షో కి సిద్దమయింది. ఇండస్త్రి లో ఇప్పుడు ఈ చిత్రం గురించి పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ చిత్రం నాగర్జున గారి కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచిపోతుంది అని ఇండస్త్రీ లో అనుకుంటున్నారు.

ఎంఎం. కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతం అందించారు మరియు రవీందర్ ఆర్ట్ డైరెక్షన్ వహించారు . పోరాట సన్నివేశాలని రాజమౌళి పర్యవేక్షించగా
ఆయన తండ్రి ప్రముక రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే అమెరికా మరియు
మిగిలిన దేశాలలో డిస్త్రిబ్యుట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు