యదార్ధ సంఘటనల ఆధారంగా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రం ఈ నెల 22 న విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న సందర్భంగా ఈ చిత్ర సక్సెస్ మీట్ ను మాదాపూర్ లోని ఎన్కన్వెన్షన్లో జరిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన కెరీర్లో అతి పెద్ద గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచిందని తెలిపారు. తనతో పాటు ఈ చిత్రంలో నటించిన ఏనీ అధ్బుతంగా నటించిందనీ భవిష్యత్తులో తను పెద్ద నటి అవుతుందని అన్నారు. కీరవాణి గారు తనకి ‘అన్నమయ్య’ ఇచ్చినందుకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో అనుకుంటుండగా ‘రామదాసు’ వంటి చిత్రం ఇచ్చారనీ అది మరువకముందే ‘రాజన్న’ లాంటి అధ్బుతమైన సంగీతం ఇచ్చారని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారికీ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారికి, కెమెరామన్ శ్యాం కె నాయుడు, కో ప్రొడ్యూసర్ సుప్రియ గారికి, ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంతగా ప్రోత్సహించిన్న ప్రెస్ వారికీ కృతజ్ఞతలు తెలిపారు. కీరవాణి మాట్లాడుతూ గిజిగాడు పాటకి తన తండ్రి గారైన శివశక్తి దత్త గారు సాహిత్యం అందించడమే కాకుండా ఆ పాట ట్యూన్ కి కూడా తోడ్పాటు అందించారని తెలిపారు. ఈ చిత్రంలో మల్లమ్మ పాత్రలో నటించిన ఏనీ మాట్లాడుతూ తను ఈ రాజన్న చిత్రంలో నటించినందుకు చాల ఆనందంగా ఉందని చెప్పింది. రాజమౌళి మాట్లాడుతూ అందరు ఈ చిత్రాన్ని తానే డైరెక్షన్ చేసినట్లు మాట్లాడుకుంటున్నారని తాను కేవలం వెయ్ వెయ్ పాట మరియు క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ లో కొంత భాగానికి మాత్రమే డైరెక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సక్సెస్ మీట్ కు చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేతలు సురేష్ రెడ్డి మరియు అచ్చి రెడ్డి, అక్కినేని అమల, అఖిల్ ఈ చిత్ర పిఆర్ఓ బిఎ రాజు హాజరయ్యారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్
- సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!
- సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !
- పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..?
- అఫీషియల్: లోకి యూనివర్స్ లోకి లారెన్స్..?
- అక్కినేని హీరోతో జాన్వీ.. సెట్ అయ్యేనా..?
- సమీక్ష: “బఘీర” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ డ్రామా
- ‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా?