అక్కినేని నాగార్జున గారు నటించిన “రాజన్న” చిత్రం డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. నిన్న రాత్రి ప్రసాద్ లాబ్స్ లో ఈ చిత్ర ప్రివ్యు ప్రదర్శించారు, నాగార్జున గారు,అక్కినేని నాగేశ్వర రావు గారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు కొంతమంది ఈ ప్రివ్యు లో పాల్గొన్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాదిస్తుందని, తన కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని చిత్ర ప్రదర్శన తరువాత నాగార్జున గారు ధీమా వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా తారలు నాగార్జున,స్నేహ, శ్వేతా మీనన్ మరియు అన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి గారు అందించిన సంగీతం ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రానికి పరిశ్రమ లో కూడా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి.
డిసెంబర్ 21న ప్రసాద్స్ మల్టిప్లెక్స్ మరియు సినిమాక్స్ లలో ఈ చిత్ర ప్రివ్యు వేస్తున్నారు. ఈ ప్రదర్శనలని ఒక మంచి కారణం కోసం ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రదర్శనల ద్వార వచ్చే ధనాన్ని బ్లూ క్రాస్ వారికి అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఆలోచన వచ్చిన నాగార్జున గారికి మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారికి అభినందనలు.