రవి తేజ – సూర్య ల త్రీడి చిత్రం

రవి తేజ – సూర్య ల త్రీడి చిత్రం

Published on Dec 23, 2011 3:01 PM IST

త్వరలో మాస్ మహారాజ రవితేజ మరియు సూర్య లు కలిసి ఒక ద్విభాషా చిత్రం లో నటించబోతున్నట్టుగా చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు అది కూడా ఒక త్రీడి చిత్రం తీయబోతున్నట్టు తెలుస్తుంది. మామూలుగా ముందు చిత్రాన్ని చిత్రీకరించి తరువాత త్రీడి లో కి మారుస్తారు అలా కాకుండా ఈ చిత్రాన్ని నేరుగా త్రీడి కెమెరా తో నే చిత్రీకరించాలని అనుకుంటున్నారు .

జ్ఞానవేల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. “గాంబ్లర్” చిత్ర దర్శకుడు అయిన వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం మొదలయితే సూర్య అభిమానులకి మరియు రవి తేజ అభిమానులకి కన్నుల పండుగే. ఈ చిత్రం కోసం మనం వేచి చూద్దాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు