సమీర రెడ్డి స్థానం లో మల్లికా

సమీర రెడ్డి స్థానం లో మల్లికా

Published on Feb 16, 2012 1:33 AM IST

అజయ్ దేవగన్ రాబోతున్న చిత్రం లో ఐటెం సాంగ్ లో సమీర రెడ్డి స్థానం లో మల్లికా షెరావత్ కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్ నటిస్తున్న చిత్రం “తేజ్” లో అనిల్ కపూర్ మరియు జాయెద్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో రాబోయే ఐటెం సాంగ్ కి ముందుగా సమీర రెడ్డి ని అనుకున్నారు కాని పలు కారణాల వల్ల సమీర రెడ్డి తప్పుకోవటం తో మల్లికా షెరావత్ ని సంప్రదించారు మల్లికా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఇదే నిజమయితే అజయ్ దేవగన్ మరియు మల్లికా షెరావత్ మొదటి సారి తెరను పంచుకోబోతున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు ఉండటంతో ఈ అడుగు మల్లికా షెరావత్ కి కలిసి వస్తుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు