సి. సి. ఎల్ కాన్సెప్ట్ ని నమ్ముకున్న శ్రియ

సి. సి. ఎల్ కాన్సెప్ట్ ని నమ్ముకున్న శ్రియ

Published on Dec 20, 2011 7:29 PM IST

సి. సి. ఎల్ కాన్సెప్ట్ మీద నటి శ్రియ బాగా నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. కాస్త సన్నబడిన శ్రియ గత నాలుగు రోజులుగా కథానాయికలు పూనం బజ్వా మరియు సంజనలతో కలిసి సి. సి. ఎల్ కర్టైన్ రైజర్ కోసం డాన్స్ ప్రాక్టీసు చేసింది. సి. సి. ఎల్ కాన్సెప్ట్ మన టాలివుడ్ కి మంచు విష్ణు మరియు విక్టరీ వెంకటేష్ లు కలిసి పరిచయం చేసారు. మొదటి సంవత్సరం నెమ్మదిగా మొదలయినా దక్షణాది ప్రముఖ తారలు చేరిక కార్యక్రమం ఊపందుకునెలా చేసింది.

ఇప్పుడు చెన్నై,హైదరాబాద్ ,బెంగళూరు ల లో ఈ ఈవెంట్ కి బాగా ప్రాచుర్యం వచ్చింది, TRP రేటింగ్స్ కూడా అధికంగానే ఉన్నాయి. ఈ కార్యక్రమం రెండవ భాగం లో నిర్వాహకులు మలయాళం మరియు బెంగాలి కథానాయకుల మరియు కథానాయికలు ని కూడా పాల్గొనుటకు ఒప్పించారు . ఇది ఈ కార్యక్రమానికి ఇంకా “గ్లామర్” ని చేకూరుస్తుంది. ఈ కార్యక్రమము యొక్క రెండవ బాగము జనవరి లో మొదలయి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు