మోహన్ బాబు తొలి చిత్రం ఈ రోజే

మోహన్ బాబు తొలి చిత్రం ఈ రోజే

Published on Nov 22, 2011 1:30 PM IST

కంగారుపడ్డారా? సరిగ్గా 36 సంవత్సరాల క్రితం 22 నవంబరు 1975 రోజన డాక్టర్ మోహన్ బాబు గారు ‘స్వర్గం నరకం’ చిత్రంతో తెలుగు చలన చిత్ర సీమలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రానికి దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మోహన్ బాబు గారు మంచి నటుడిగా నిరూపించుకున్నారు. తరువాత చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

మోహన్ బాబు గారు పౌరాణిక పాత్రలకు మరియు డైలాగులకు ప్రసిద్ధి. ఆయనతోపాటు నటించిన ఆ తరం నటులు ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ గార్లతో పోలిస్తే మోహన్ బాబు గారు డాన్సులు, ఫైట్లు డైలాగులు ఇలా అన్నింట్లోను తన విభిన్నశైలిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ బాబు గారికి 123తెలుగు.కాం తరపున శుభాకాంక్షలు తెలియచెస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు