మోహన్ బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on Mar 16, 2021 7:20 am IST

మంచు విష్ణు హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘మోసగాళ్లు’. ప్రపంచంలోని అతిపెద్దదైన ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆత్యహదిక భాగం విదేశాల్లోనే షూటింగ్ జరిపారు. కాగా ఈసినిమా మార్చి 19న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ వేడుకలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్ బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు

మోహన్ బాబు మాట్లాడుతూ.. ”కాజల్ ఎంత మంచి నటి అన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు పక్కన అక్కగా నటించేందుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాత్రను ఒప్పుకున్నందుకు ప్రశంసిస్తున్నాను. ఒక వేళ నీ(కాజల్) స్థానంలో నేను ఉంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదు. జీవితంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక విధంగా మోసపోతారు. మంచి తెలివితేటలున్నాయ్ మోసపోను అని చెబుతుంటారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక చోట మోసపోతారు. నన్ను కూడా నా భార్య అంటూ ఉంటుంది.. నిన్ను పెళ్లి చేసుకుని నేను మోసపోయాను అని.. (నవ్వుతూ..). సినిమా విషయానికి వస్తే.. భారతదేశంలో ఇటువంటి స్కామ్‌ ఇప్పటి వరకు జరగలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువత చూడాల్సిన సినిమా. అని అన్నారు.

సంబంధిత సమాచారం :