తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ 3వ భాగం ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారందరికీ షాకిచ్చే ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో రూపొందిన ‘దృశ్యం-3’ చిత్రం సమ్మర్ ట్రీట్‌గా మే 21న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
అయితే, మలయాళ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాకు రీచ్ మరింత పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో తెలుగులోనూ మోహన్ లాల్ ‘దృశ్యం-3’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా మలయాళ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తెలుగు వెర్షన్లోనూ రిలీజ్ చేయడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
కాగా, తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ ఫ్రాంచైజీ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు. మరి ఇప్పుడు వెంకటేష్‌ను కాదని మోహన్ లాల్ ‘దృశ్యం-3’ని తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో ఇక్కడి ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
