మలయాళ సినిమా సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే మూడు సినిమాలు తాను నటించినవి వచ్చేసాయి. ఇక ఈ సినిమాలు కాకుండా మరో భారీ సినిమాని తాను తీసుకొస్తున్నారు. మరి ఆ సినిమానే “వృషభ”. దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా మేకర్స్ దీనిని పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు తెలుగు ట్రైలర్ ని వదిలారు. మరి ఈ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాల్సిందే. ఒక పక్క పీరియాడిక్ అంశాలు ఇంకోపక్క ప్రస్తుత టైం లైన్ లో సీన్స్ తో ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ని మేకర్స్ ప్రెజెంట్ చేసారని చెప్పాలి. వృషభ మహారాజుగా మోహన్ లాల్ గత జన్మలో కనిపిస్తుండగా అందులో యాక్షన్ ఇంకా విజువల్స్ మంచి గ్రాండ్ గా కూడా కనిపిస్తున్నాయి.
అలాగే తనకి కొడుకు పాత్రలో సమర్ జిత్ లంకేశ్ కూడా తన తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే కొడుకులా కనిపిస్తున్నాడు. ఇక వీరిపై మంచి మాస్ ఎపిసోడ్స్ కూడా ఉండేలా ఉన్నాయి. అలానే పాన్ ఇండియా లెవెల్లో నోటెడ్ నటీనటులు అంతా ఇందులో కనిపిస్తున్నారు. అలాగే ఇందులో సంగీతం ఇంకా కెమెరా వర్క్ కూడా సాలిడ్ గా కనిపిస్తుండగా మేకర్స్ నిర్మాణ విలువలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకి ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే.


