భక్తవత్సల నాయుడు గా మోహన్ బాబు..!

భక్తవత్సల నాయుడు గా మోహన్ బాబు..!

Published on Feb 28, 2020 9:24 PM IST

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం సురారై పోట్రు, తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది.

కాగా ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య ఎలాగైనా ఎయిర్ వేస్ స్థాపించాలని వేసే అడుగులలో మార్గ దర్శకుడిగా మోహన్ బాబు పాత్ర ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని మోహన్ బాబు లుక్ విడుదల చేశారు. ఎయిర్ వేస్ లో పనిచేసే ఎంప్లొయ్ గా మోహన్ బాబు కనిపిస్తుండగా, ఈ చిత్రంలో ఆయన భక్తవత్సల నాయుడు అనే పేరు పెట్టుకున్నారు. భక్తవత్సల నాయుడు మోహన్ బాబు ఒరిజినల్ నేమ్. మోహన్ బాబు ఆయన స్క్రీన్ నేమ్. చాలా కాలం తరువాత తన రియల్ నేమ్ ని మోహన్ బాబు సినిమాలో పాత్రకు వాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు